LAWCET: లాసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు 3 d ago
ఆంధ్రప్రదేశ్ లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీ లాసెట్) / పోస్ట్ గ్రాడ్యుయేట్ లా కోర్స్ (ఎల్ఎల్ఎం- ఏపీ పీజీఎల్ సెట్)-2026 దరఖాస్తు గడువును రాష్ట్ర ఉన్నత విద్యామండలి పొడిగించింది. గతంలో మార్చి 12 వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఉండగా దానిని మార్చి 20 వరకు పొడిగించారు. ఏపీ లాసెట్ పరీక్షను తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నిర్వహించనుంది. ప్రవేశ పరీక్షను మే 4వ తేదీన నిర్వహించనున్నారు. హాల్‌టికెట్స్ ఏప్రిల్ 20 నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ తో 2026-27 విద్యా సంవత్సరానికి ఏపీలోని విశ్వవిద్యాలయాలు వాటి అనుబంద కళాశాలల్లో 5,3,2 ఏళ్ల ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం/ ఎంఎల్ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.